బస్సు డ్రైవర్: డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో అదుపుతప్పిన ఇంజనీరింగ్ కాలేజీ బస్సు.. ఒకరి మృతి
- గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం వద్ద ప్రమాదం
- ఒకరికి తీవ్రగాయాలు
- బస్సు డ్రైవర్ పరిస్థితి విషమం
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ రహదారి గుండా వెళుతోన్న ఓ ఇంజనీరింగ్ కళాశాల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పాదచారుల మీదకు దూసుకువెళ్లింది. ఆ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బస్సు ఇద్దరిపైకి దూసుకెళ్లిందని, అందులో ఒకరు మృతి చెందారని, మరొకరికి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. వారిని ఢీకొన్న తరువాత చెట్టును ఢీకొని ఆ బస్సు ఆగిపోయిందని అన్నారు. ఈ ఘటనలో విద్యార్థులకు ఎటువంటి గాయాలూ కాలేదు. సదరు బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.