ధోనీ-కోహ్లీ: అభిమాని వినూత్న ఆలోచన.. 'ధోనీ-కోహ్లీ రెస్టారెంట్'.. ఫొటోలు వైరల్!
- ముంబయిలో కాండీవలి ఈస్ట్ ప్రాంతంలో ధోనీ-కోహ్లీ రెస్టారెంట్
- వినూత్నంగా ఆలోచించి ఆ పేరు పెట్టిన అభిమాని
- ఫ్రీ పబ్లిసిటీ
ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లు ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ. అయితే, వారి పేర్లతో ముంబయిలో కాండీవలి ఈస్ట్ ప్రాంతంలో ఓ రెస్టారెంట్‌ను స్థాపించాడు ఓ అభిమాని. ఈ రెస్టారెంట్‌తో ధోనీ, కోహ్లీకి ఎటువంటి సంబంధమూ లేదు. ఆ రెస్టారెంటుకి ధోనీ అండ్ కోహ్లీ అని పేరు పెట్టడంతో ఆ రెస్టారెంటుకి ఉచితంగా పబ్లిసిటీ వచ్చేస్తోంది. ఈ రెస్టారెంటుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ హోటల్ నిర్వాహకులు చాలా తెలివిగా ఆలోచించారని నెటిజన్లు పేర్కొంటున్నారు. క్రికెట్ అభిమానులు ఈ రెస్టారెంటుపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. (రాత్రి సమయంలో ఇలా ఉంటుంది)