మోదీ: సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న మోదీ.. ఫొటోలు
- జమ్ముకశ్మీర్‌లోని గురేజ్ వ్యాలీలో మోదీ
- సైనికులకు మిఠాయిలు అందించిన ప్రధాని
- సైనికులు అందించే సేవలపై ప్రశంసలు
- సైనికులు ప్రతిరోజు యోగా చేస్తున్నారని తెలుసుకుని హర్షించా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని గురేజ్ వ్యాలీకి చేరుకున్న ఆయన సైనికులకు మిఠాయిలు అందించారు. దాదాపు రెండు గంటలపాటు సైనికులతో ముచ్చటించారు. బార్డర్‌లో సైనికులతో నరేంద్ర మోదీ దీపావళి జరుపుకోవడం ఇది నాలుగోసారి. సైనికులతో గడపడం తనకు నూతన శక్తిని ఇచ్చిందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతికూల వాతావరణంలో సైనికులు నిర్వర్తించే బాధ్యతలు ఎంతో గొప్పవని కొనియాడారు. సైనికులు ప్రతిరోజు యోగా చేస్తున్నారని తెలుసుకుని హర్షించానని అన్నారు.