మంత్రి దేవినేని: అదే కనుక జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు పార్టీ పెట్టేవారే కాదు: మంత్రి దేవినేని
- అప్పట్లో పోలవరం పనుల ప్రాజెక్టు కోసం జగన్ ప్రయత్నించారు
- ఓ వైపు వైఎస్సార్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ అదృశ్యమైతే.. మరోవైపు టెండర్లు వేయాలని చూశారు
- కేవీపీ రామచంద్రరావుతో కలిసి జగన్ పోలవరం పనులకు టెండర్లు వేయడానికి తాపత్రయపడ్డారు
అప్పట్లో పోలవరం పనుల ప్రాజెక్టు దక్కి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు పార్టీ పెట్టేవారే కాదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ అదృశ్యమై రాష్ట్రమంతా ఆందోళనలో ఉంటే అదే సమయంలో కేవీపీ రామచంద్రరావుతో కలిసి జగన్ పోలవరం పనులకు టెండర్లు వేయడానికి తాపత్రయ పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. జలవిద్యుత్ ప్రాజెక్టును కొట్టేయడానికే జగన్ పోలవరం పనులకు టెండర్లు వేశారని ఆరోపించారు.