అంబులెన్సులు: 300 పాత అంబులెన్సులను ధ్వంసం చేయనున్న ఏపీ ప్రభుత్వం
- మూడేళ్లుగా పనికిరాకుండా మూలనపడ్డ 300ల ‘108 అంబులెన్స్’ వాహనాలు
- కృష్ణా జిల్లా పెద అవుటపల్లిలో పాత అంబులెన్సులు
- ఇంజన్లు కూడా పూర్తిగా డ్యామేజ్
మూడేళ్లుగా పనికిరాకుండా మూలనపడ్డ 300ల ‘108 అంబులెన్స్’ వాహనాలను పూర్తిగా ధ్వంసం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా 300 అంబులెన్సులలో 255 అంబులెన్సులను తుక్కుగా మార్చాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త 108 వాహనాలను కొనుగోలు చేసిన ప్రభుత్వం... కృష్ణా జిల్లా పెద అవుటపల్లిలో పాత అంబులెన్సులను ఉంచుతూ వచ్చింది. మూలనపడ్డ ఈ వాహనాల్లో దాదాపు రెండున్నర లక్షల కిలో మీటర్లు తిరిగిన వాహనాలు దాదాపు 150 వరకు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇవి నడిచే స్థితిలో లేవు. ఇంజన్లు కూడా పూర్తిగా పాడయిపోయాయి.