సమంత: అలా ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదు: సమంత

  • న‌ట‌న కొన‌సాగిస్తారా? అంటూ అడుగుతున్నారు
  • కుటుంబం ఎంత ముఖ్యమో నటన కూడా అంతే ప్ర‌ధాన‌ం
  • ఒకదాని కోసం మ‌రోదాన్ని వదులుకోలేను
  • నేను ఎంజాయ్‌ చేయగలిగే పాత్రలనే ఎంచుకుంటా

ఇప్పుడు కూడా న‌ట‌న కొన‌సాగిస్తారా? అంటూ అక్కినేని వారి కోడలైన నటి సమంతను అందరూ ప‌దే ప‌దే అడుగుతున్నార‌ట‌. కానీ, ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పి చెప్పీ అమ్మడికి విసుగొచ్చేస్తోంది. తాజాగా స‌మంత ఓ ఇంట‌ర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ... త‌న‌ను ఇప్పుడు కూడా ఇలా ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించింది. త‌న‌కు కుటుంబం ఎంత ముఖ్యమో నటన కూడా అంతే ప్ర‌ధాన‌మ‌ని తేల్చి చెప్పింది. ఒకదాని కోసం మ‌రోదాన్ని వదులుకోలేనని అంది.
 
 కాగా, తాను సినిమాల్లోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోందని, తాను ఎక్కువగా ఒకే తరహా పాత్రల్లో నటిస్తున్నందుకు త‌న‌ను విమర్శించిన వారు ఉన్నార‌ని, అయితే, తాను ఓ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నానని త‌న‌కు తెలుసని పేర్కొంది. తాను ఎంజాయ్‌ చేయగలిగే పాత్రలనే ఎంచుకుంటానని, త‌న‌కు ఎవ్వరితోనూ పోటీ లేద‌ని స‌మంత చెప్పుకొచ్చింది. 

  • Loading...

More Telugu News