: ముంబైలో అమెరికా కాన్సులేట్ పై ఉగ్రదాడులకు అవకాశం
ఉగ్రదాడులపై ఇంటెలిజెన్స్ బ్యూరో తాజా హెచ్చరికలు జారీ చేసింది. ముంబైలోని అమెరికా కాన్సులేట్ పై ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ నుంచి ఈ మేరకు సమాచారం ముంబైలోని నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయానికి, అక్కడి నుంచి స్థానిక పోలీసులకు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. కాన్సులేట్ పై దాడి చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఒక లేఖ అమెరికా కాన్సులేట్ తో పాటు ముంబై పోలీసులకూ చేరింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.