మహేశ్ బాబు: మహేశ్ బాబు ఎలా ఎదిగాడో.. రవితేజ కొడుకు కూడా అలా ఎదగాలి: నిర్మాత దిల్ రాజు ఆకాంక్ష

  • రవితేజ కొడుకు మహాధన్ కు మంచి భవిష్యత్తు ఉండాలి
  • మా చిత్రం ద్వారా అతన్ని లాంచ్ చేసే అవకాశం రావడం సంతోషం
  • ‘రాజా ది గ్రేట్’ సక్సెస్ మీట్ లో దిల్ రాజు 

బాల నటుడి నుంచి స్టార్ గా మహేశ్ బాబు ఎలా ఎదిగాడో.. రవితేజ కొడుకు మహాధన్ కూడా అలా ఎదగాలని కోరుకుంటున్నానని  నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘రాజా ది గ్రేట్’  సక్సెస్ మీట్ లో దిల్ రాజ్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో రవితేజ కొడుకు మహాధన్ తో యాక్టు చేయించాలని అనుకుంటున్నామని దర్శకుడు అనిల్ రావిపూడి నాకు చెప్పాడు. ‘రవితేజ ఒప్పుకుంటారా?’ అని నేను అడిగా. ‘మీకెందుకు సార్, నేను ఒప్పిస్తా’ అని అనిల్ సమాధానం చెప్పాడు. ఈ సినిమా ద్వారా రవితేజ కొడుకును లాంచ్ చేసే అవకాశం మాకు రావడం సంతోషం. థియేటర్ లో స్క్రీన్ పై మహాధన్ ని చూస్తుంటే హీరో పుట్టేశాడని పిస్తోంది. అతనికి ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా’ అని దిల్ రాజు అన్నారు.

  • Loading...

More Telugu News