దిల్ రాజ్: టపాకాయలు కాల్చి.. కేక్ కట్ చేసిన ‘రాజా ది గ్రేట్’ చిత్ర బృందం

  • ‘రాజా ది గ్రేట్’ అంతకు మించి విజయం సాధించింది
  • ఈ సినిమాకు డబ్బు మాత్రమే కాదు పేరు కూడా వస్తోంది
  • రవితేజ కెరీర్ లోనే  బిగ్ సక్సెస్ సాధించిన చిత్రమిది
  • సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ‘రాజా ది గ్రేట్’ చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, టపాకాయలు కాల్చి, కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ‘ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో ఆ రోజు ఊహించి మాట్లాడాను. కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. కాన్ఫిడెన్స్ నాలో ఉండటం వల్లే అలా మాట్లాడాను. ఈ సినిమా హిట్, సూపర్ హిట్ రేంజ్ లో ఉంటుందని నాకు ముందు నుంచి అనిపించేంది. నాకు వస్తున్న ఫోన్ కాల్స్ చూస్తుంటే అంతకుమించి ఈ చిత్రం విజయం సాధించింది. ఈ సినిమాకు డబ్బు  మాత్రమే కాకుండా పేరు కూడా వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రవితేజ కెరీర్ లోనే బిగ్ సక్సెస్ సాధించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ చిత్రం నాన్ స్టాప్ ఎంటర్ టెయినర్. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్’ అని అన్నారు.

  • Loading...

More Telugu News