నంబర్ వన్: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి ప్రపంచస్థాయి నంబర్ వన్ ర్యాంకు
- ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ర్యాంకులు విడుదల
- 5-15 మిలియన్ల ప్రయాణికుల క్యాటగిరీలో అత్యుత్తమ సేవలు
- మరింత పెరగనున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్
ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో హైదరాబాద్ శివారులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్‌జీఐఏ) కు ప్రపంచస్థాయి నంబర్‌వన్ ర్యాంకు లభించింది. గత ఏడాదికి గానూ 5-15 మిలియన్ల ప్రయాణికుల క్యాటగిరీలో ఈ విమానాశ్రయం ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందించిందని ఆ సంస్థ పేర్కొంది.
ఈ ర్యాంకుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని జీహెచ్‌ఐఏఎల్ సంస్థ పేర్కొంది. నిన్న మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు గానూ ట్రోఫీని అందుకున్నట్లు చెప్పింది. శంషాబాద్ విమానాశ్రయం తన స్కోర్‌ను క్రమంగా పెంచుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.