సండ్ర: నారా లోకేశ్ తో టీటీడీపీ నేత సండ్ర భేటీ!
- ముందుగా తీసుకున్న అపాయింట్ మేరకే లోకేశ్ ను కలిశా
- మీడియాతో ఎమ్మెల్యే సండ్ర
- రేవంత్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడుకున్నట్టు సమాచారం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ నిన్నటి నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ ను తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
ముందుగా తీసుకున్న అపాయింట్ మెంట్ మేరకే లోకేశ్ ను కలిశానని సండ్ర చెబుతుండటం గమనార్హం. కాగా, రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఢిల్లీకి వెళుతున్నట్టు రేవంత్ తనకు ముందుగానే చెప్పారని మరోపక్క నారా లోకేశ్ పేర్కొనడం విదితమే.