సీపీఐ: ‘కాంగ్రెస్’తో పొత్తు సాధ్యం కాకపోవచ్చు: సీపీఐ నేత సురవరం
- ఎన్నికలకు ముందే పొత్తు గురించి చెప్పలేం
- ఉమ్మడి అజెండా ఉంటే కలిసి పోరాడతాం
- పాత్రికేయులతో సురవరం సుధాకర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీతో వామపక్షాల పొత్తు విషయాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు. ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వామపక్షాలు ప్రతిపక్షాలుగా ఉన్నాయని, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న కారణంగా ముందుగానే సయోధ్య కుదరదని, ఎన్నికలకు ముందే ‘కాంగ్రెస్’ తో పొత్తు వ్యవహారం గురించి చెప్పలేమని, సాధ్యం కాకపోవచ్చని అన్నారు. ఉమ్మడి అజెండా ఉంటే కాంగ్రెస్ తో కలిసి పోరాడతామని, లేనిపక్షంలో కుదరదని అన్నారు.