పాస్టర్ ఎబునేజర్: ఏపీ డేరాబాబా పాస్టర్ ఎబునేజర్ ను జైలుకి పంపిస్తా!: నన్నపనేని రాజకుమారి

  • పశ్చిమ గోదావరి జిల్లా చర్చి ఘటనపై మండిపడ్డ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్
  • బాధిత యువతుల కుటుంబాలను కలిసిన నన్నపనేని
  • పాస్టర్ ఎబినైజర్‌కు శిక్ష పడేలా చూస్తా.. జైలుకు పంపిస్తా

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చర్చి పాస్టర్ ఎబునేజర్ ఆగడాలపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. తాడేపల్లిగూడెం మండలం జగ్నాథపురంలో చర్చి పాస్టర్ గా పనిచేస్తూ, దైవ బోధకుడి ముసుగులో పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేస్తూ, లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఎబునేజర్ పై చర్యలకు ఆమె ఆదేశించారు. ఈరోజు జగన్నాథపురం వెళ్లిన ఆమె, బాధిత యువతుల తల్లిదండ్రులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ, ఏపీ డేరాబాబాగా ఎబునేజర్ అవతారమెత్తాడని, కామాంధుడైన అతన్ని జైలుకు పంపిస్తామని అన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, బాధితుల ఫిర్యాదులను విదేశాల నుంచి సీఎం చంద్రబాబు రాగానే ఆయనకు అందజేస్తానని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతానని చెప్పారు. ఈలోగా, ఈ విషయమై పోలీస్ అధికారులతో మాట్లాడతానని ఆమె చెప్పారు. కాగా, పాస్టర్ చెరలో ఉన్న మొత్తం ఐదుగురు యువతుల తల్లులు తమ ఆవేదనను నన్నపనేని రాజకుమారి ముందు వ్యక్తం చేశారు. గదిలో బట్టలు లేకుండా పడుకుని తన కూతురితో పాస్టర్ కాళ్లు ఒత్తించుకోవడాన్ని కళ్లారా చూశానని బాధిత యువతి తల్లి ఒకరు వాపోయారు. 

  • Loading...

More Telugu News