వర్సం: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం
- తీరం వెంబడి తీవ్ర గాలులు
- రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి నైరుతి దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అది వాయుగుండంగా మారి వాయవ్యంగా పయనించి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాల దిశగా రానుందని చెప్పారు. తీరం వెంబడి తీవ్రంగా గాలులు వీస్తోన్న నేపథ్యంలో కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.