రేవంత్ రెడ్డి: రేవంత్ రెడ్డి పార్టీ మారినా పెద్ద నష్టమేమీ లేదు: టీడీపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్

  • రేవంత్ చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో టీడీపీ బలహీనపడింది
  • పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై రేవంత్ స్పందించాలి
  • మీడియాతో అరవింద్ కుమార్ గౌడ్

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే స్పందించారు. తాజాగా, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ ఈ విషయమై మాట్లాడుతూ, తమ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వెళ్లినా పెద్ద నష్టమేమీ లేదని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో టీడీపీ బలహీన పడిందని ఆరోపించారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై రేవంత్ రెడ్డి స్పష్టత నివ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 

  • Loading...

More Telugu News