రేవంత్ రెడ్డి: రేవంత్ పార్టీ మారడంపై స్పందించిన నారా లోకేశ్!
- ఆ వార్తలు ఊహాగానాలు మాత్రమే
- పార్టీ మారుతున్నట్టు రేవంత్ ఎక్కడా చెప్పలేదు
- కోర్టు పని నిమిత్తం ఢిల్లీ వెళ్లానని నాకు చెప్పారు
- మీడియాతో మంత్రి నారా లోకేశ్
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు నిన్నటి నుంచి మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయమై ఏపీ మంత్రి, టీడీపీ నేత లోకేశ్ మాట్లాడుతూ, ఆ వార్తలు ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టు రేవంత్ ఎక్కడా చెప్పలేదని, కోర్టు పని నిమిత్తం తాను ఢిల్లీ వెళ్లానని రేవంత్ తనకు చెప్పారని అన్నారు. రేవంత్ ను తమ పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు కలిసిన విషయం తనకు తెలియదని అన్నారు.