raviteja: అంధుడిగా రవితేజ అదరగొట్టేశాడు .. 'రాజా ది గ్రేట్' పై పబ్లిక్ టాక్!

  • ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాజా ది గ్రేట్' 
  • ప్రీమియర్ షోల ద్వారా బయటికి వచ్చిన టాక్ 
  • రవితేజకు ప్రశంసలు 
  • అనిల్ రావిపూడికి అభినందనలు    

రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'రాజా ది గ్రేట్' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూఎస్ తో పాటు పలు దేశాల్లోను .. తెలుగు రాష్ట్రాల్లోను ప్రీమియర్ షోలు పడటం వలన, ఈ సినిమా టాక్ బయటకి వచ్చింది. కథ .. కథనాలు .. రవితేజ నటన ఈ సినిమాకి ప్రధాన బలమని చెబుతున్నారు.

అంధుడిగా రవితేజ అద్భుతంగా నటించాడనీ, పూర్తిస్థాయిలో అంధుడిగా కనిపించే పాత్రను చేయడానికి ఆయన అంగీకరించినందుకు అభినందించాల్సిందేనని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ కూడా బాగా ఆకట్టుకుందనీ, ముఖ్యంగా 'గున్నా గున్నా మామిడి' ఎపిసోడ్ హైలైట్ గా నిలిచిందని చెబుతున్నారు. కొంత గ్యాప్ తరువాత చేసినా .. రవితేజ మంచి సినిమా చేశాడనీ, దర్శకుడిగా అనిల్ రావిపూడి తానేమిటనేది మరోమారు నిరూపించుకున్నాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.     

More Telugu News