సుబ్రహ్మణ్య స్వామి: ఆక్రమిత భూమిలో తాజ్ మహల్ నిర్మించారు: సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
- ‘తాజ్ మహల్’పై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం
- తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత
- ఆక్రమిత భూమిలో తాజ్ మహల్ నిర్మించారన్న స్వామి
భారత సంస్కృతికి తాజ్ మహల్ ఓ మాయని మచ్చ అని యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. తాజ్ మహల్ ను ఎవరు, ఎందుకు కట్టించారనే విషయం అనవసరమని, ఆ కట్టడాన్ని భారతీయ కార్మికుల రక్తం, చెమటతో నిర్మించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించడమూ విదితమే.
తాజాగా, ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. చారిత్రక కట్టడం తాజ్ మహల్ ను ఆక్రమిత భూమిలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.