మోదీ: శభాష్ మోదీ.. ప్రధానిని ఆకాశానికెత్తేసిన ప్రణబ్ ముఖర్జీ!
- నరేంద్ర మోదీ తనదైన రీతిలో కష్టించి పనిచేస్తారు
- లక్ష్యాలను సాధించడంలో ఆయనకు చాలా నిబద్ధత ఉంది
- శ్రమించే తత్త్వం, దృఢనిశ్చయం ఆయనలో ఉన్నాయి
- పార్లమెంటులో అంతకుముందు ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ మోదీ రాణిస్తున్నారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల జల్లు కురిపించారు. నరేంద్ర మోదీ తనదైన రీతిలో కష్టించి పనిచేస్తారని అన్నారు. తన లక్ష్యాలను సాధించడంలో ఆయనకు చాలా నిబద్ధత ఉందని అన్నారు. తన విజన్‌ను సాధించడంలో మోదీ పూర్తి స్పష్టతతో ఉన్నారని తెలిపారు. శ్రమించే తత్త్వం, దృఢనిశ్చయం ఆయనలో ఉన్నాయని కొనియాడారు. పరిపాలన, రాజకీయాలు, విదేశాంగ విధానాల్లోని చిక్కులను ఆయన సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారని తెలిపారు.
మోదీకి పార్లమెంటులో అంతకుముందు ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ ఆయన రాణిస్తున్నారని ప్రణబ్ అన్నారు. మోదీ మే, 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించి పక్క దేశాల ప్రభుత్వాలతో సత్సంబంధాలు పెంచుకునే విషయంలో చక్కగా వ్యవహరించారని తెలిపారు.