karthi: 'ఖాకీ' ట్రైలర్ రిలీజ్ .. యాక్షన్ తో దుమ్మురేపేస్తోన్న కార్తీ

  • కార్తీ హీరోగా రూపొందిన 'ఖాకీ' 
  • వాస్తవంగా జరిగిన వరుస హత్యలే కథా వస్తువు 
  • కథానాయికగా రకుల్ 
  • నవంబర్లో విడుదల  

తమిళంలో కార్తీ కథానాయకుడిగా 'ధీరమ్ అధిగారం ఒండ్రు' సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాకి 'ఖాకీ' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ కథానాయికగా నటించింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేయనున్నారు.

 ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ దృశ్యాలకి ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యాక్షన్ .. ఛేజింగ్ దృశ్యాలలో కార్తీ దుమ్మురేపేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 1995 - 2005 మధ్య కాలంలో జరిగిన వరుస హత్యల నేపథ్యలో ఈ సినిమాను తెరకెక్కించారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో కార్తీ వున్నాడు.


More Telugu News