జగనన్న: ఒక మంచి అన్న‌య్య ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చుంటాడు: జ‌గ‌న్

  • చేనేతలు, వృత్తిపనులు చేసుకునే బడుగు కూలీలకి 45 ఏళ్లు నిండితే చాలు పింఛన్ ఇస్తా
  • నేను సీఎం అయ్యాక అన్ని సమస్యలనూ తీర్చుతా
  • అంద‌రం ఒక్కటై మ‌న‌ ప్ర‌భుత్వాన్ని తెచ్చుకుందాం
  • ప్రతి ల‌బ్దిదారుకి నెల‌కు రూ.వెయ్యి పింఛ‌న్‌ కాదు.. రెండు వేల రూపాయ‌లు ఇస్తా

దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి చేనేతలు, వృత్తిపనులు చేసుకునే బడుగు కూలీలందరికీ 50 ఏళ్లకే పెన్షన్‌ ఇచ్చే ఏర్పాటు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. ‘మీ అన్న (జ‌గ‌న్‌) ముఖ్య‌మంత్రి అవుతాడు.. దాన్ని 45 ఏళ్ల‌కు త‌గ్గిస్తాడు.. అంద‌రం ఒక్కటై మ‌న‌ ప్ర‌భుత్వాన్ని తెచ్చుకుందాం’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఒక మంచి అన్న‌య్య ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చుంటాడని తనను ఉద్దేశించి జ‌గ‌న్ అన్నారు. ఈ రోజు బెంగ‌ళూరు నుంచి అనంత‌పురం వ‌చ్చిన జ‌గ‌న్‌... ధ‌ర్మ‌వ‌రంలో ముడిపట్టు రాయితీ బకాయిల కోసం దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపారు.
 
అనంతరం ప్రజలను ఉద్దేశించి జ‌గ‌న్ మాట్లాడుతూ... తాను సీఎం అయ్యాక ప్రతి ల‌బ్దిదారుకి నెల‌కు వెయ్యి రూపాయ‌ల పింఛ‌న్‌ను కాకుండా నెల‌కు రెండు వేల రూపాయ‌లు ఇస్తానని చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు సీఎం అయ్యాక ఆప్కోను నిర్వీర్యం చేశారని అన్నారు. మ‌న‌సున్న నాయ‌కుడు వైఎస్సార్ మాత్ర‌మేన‌ని జ‌నాలు అనుకుంటున్నార‌ని, ఆయ‌న పాల‌న‌ను మ‌ళ్లీ తీసుకొస్తాన‌ని అన్నారు. పేద‌లు ప‌నులకు పోతేనే వారికి ఆ రోజు క‌డుపు నిండుతుంద‌ని చెప్పారు. చంద్ర‌బాబు నాయుడి పాల‌న‌లో ప‌నులు కూడా దొర‌క‌క వారు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారని అన్నారు.

పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తార‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్ప‌టికీ త‌న మాట‌ను నిల‌బెట్టుకోలేద‌ని జగన్ అన్నారు. తాను మాత్రం పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు రుణం ఇచ్చేందుకు చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. చంద్రబాబు మాటలకు, బడ్జెట్ లో కేటాయింపులకు ఏ మాత్రం పోలిక ఉండదని విమర్శించారు. 

  • Loading...

More Telugu News