అనిరుథ్: పవన్ కల్యాణ్ బిగ్ స్టార్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు: యువ సంగీత దర్శకుడు అనిరుథ్
- తెలుగులో నేను సంగీతం అందిస్తున్న మొదటి సినిమా ఇదే
- ‘చిత్ర పరిశ్రమకు స్వాగతం’ అంటూ పవన్ ఆహ్వానించారు
- పవన్ ఫ్యాన్స్ ను నా సంగీతంతో మెప్పిస్తా
- ఓ ఇంటర్వ్యూలో అనిరుథ్
త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను సంగీతం అందిస్తున్నతొలి తెలుగు సినిమా ఇదేనని, త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం అందించడం తనకు చాలా గొప్పగా ఉందని అన్నాడు.
పవన్ కల్యాణ్ బిగ్ స్టార్ అని ప్రపంచం మొత్తానికి తెలుసని, షూటింగ్ సమయంలో ఆయన్ని కలిస్తే.. ‘చిత్ర పరిశ్రమకు స్వాగతం’ అంటూ పవన్ తనకు ఆహ్వానం పలికారని చెప్పాడు. పవన్ కల్యాణ్ మాస్ హీరో కనుక, ఆయన సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయని, మ్యూజిక్ లవర్స్ ను, పవన్ ఫ్యాన్స్ ను తన సంగీతం మెప్పిస్తుందని అనుకుంటున్నానని అనిరుథ్ చెప్పుకొచ్చాడు.