కంచ ఐలయ్య: కంచ ఐలయ్యపై మరోమారు మండిపడ్డ టీజీ వెంకటేష్!
- మతాలను, కులాలను కంచ ఐలయ్య కించపరుస్తున్నారు
- ఆయన్ని కొట్టడం దండగ, టైమ్ వేస్ట్!
- ఐలయ్య తన పుస్తకంలో వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే.. ఉరితీయాలనే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటా
- మీడియాతో టీజీ వెంకటేష్
'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తక రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై ఏపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మతాలను, కులాలను కంచ ఐలయ్య కించపరుస్తున్నారని, ఆయన్ని కొట్టడం దండగ, టైమ్ వేస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘ఐలయ్యను ఎవరు చంపుతారు? భారత్ లో రక్షణ లేదంటూ అమెరికా సెనేటర్లకు మొరపెట్టుకున్నారు?’ అని ప్రశ్నించారు. కంచ ఐలయ్య తన పుస్తకంలో రాసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే కనుక, ఐలయ్యను ఉరితీయాలంటూ నాడు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని అన్నారు.