రేవంత్: నేను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తోన్న వార్తలు అబద్ధం: రేవంత్ రెడ్డి ఆగ్రహం
- ఢిల్లీలో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారని వార్తలు
- ఆ ప్రచారంలో నిజం లేదన్న రేవంత్ రెడ్డి
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అవుతున్నారని, కాంగ్రెస్ లో చేరతారని, టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అవుతారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై రేవంత్ రెడ్డి స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతున్నట్లు వస్తోన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని వస్తోన్న వార్తలను ఖండిస్తున్నానని తెలిపారు.