కీర్తి సురేశ్: ఆ కళ్లే 'మహానటి' జీవిత కథను చెప్పబోతున్నాయి!: కీర్తి సురేశ్ కు సమంత విషెస్

  • ట్వీట్ చేసిన సమంత
  • ఆ కళ్లను ఎవ్వరూ దాచలేరు..
  • ఆ కళ్లే ‘మహానటి’ జీవిత చరిత్రను చెప్పబోతున్నాయన్న సామ్

ఈరోజు ప్రముఖ నటి కీర్తి సురేశ్  బర్త్ డే. ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్రంలో ఆమె పోషిస్తున్న సావిత్రి పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇప్పటికే అభిమానుల నుంచి శుభాకాంక్షలు, ప్రశంసలు అందుకున్న కీర్తి సురేశ్ పై మరో నటి సమంత తన శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె ఓ ట్వీట్ చేసింది. ‘ఆ కళ్లను ఎవ్వరూ దాచలేరు. ఆ కళ్లే మహానటి జీవిత చరిత్రను చెప్పబోతున్నాయి. కీర్తి సురేశ్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తన ట్వీట్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News