ఎన్టీఆర్: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ.. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతితో పాటు చంద్రబాబు ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన వర్మ!
- ఓ ఫొటోలో లక్ష్మిపార్వతి మెడలో ఎన్టీఆర్ పూలదండ వేస్తున్నారు
- మరో ఫొటో ఎన్టీఆర్ కన్నుమూసినప్పటిది
- రెండు ఫొటోల్లోనూ వున్న చంద్రబాబు
ఎన్టీఆర్ ఆత్మ నిత్యమూ కలలోకి వస్తోందని, స్క్రిప్ట్ సహకారం కూడా ఆయనదేనని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఉదయం ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ కొద్ది సేపటి క్రితం ఎన్టీఆర్, లక్ష్మీపార్వతికి సంబంధించిన నిజ జీవిత ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
వాటిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉండడం గమనార్హం. వర్మ పోస్ట్ చేసిన ఓ ఫొటోలో లక్ష్మీపార్వతి మెడలో ఎన్టీఆర్ పూల దండ వేస్తుండగా, వారిద్దరినీ చూస్తూ చంద్రబాబు నిలబడ్డారు. మరో ఫొటో ఎన్టీఆర్ కన్నుమూసినప్పటిది. అందులోనూ చంద్రబాబు ఉన్నారు. మీరూ చూడండి...