అజాంఖాన్: పార్లమెంట్, రాష్ట్రపతి భవన్.. అన్నింటినీ ధ్వంసం చేయాలి: అజాంఖాన్ సంచలన వ్యాఖ్యలు
- తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అజాంఖాన్
- తమ రాష్ట్ర పర్యాటక గైడులో నుంచి తాజ్‌మహల్‌ను తొలగించిన యూపీ
- దేశాన్ని పాలించిన వారిని గుర్తు చేసే చారిత్రాత్మక కట్టడాలను ధ్వంసం చేయాలన్న అజాంఖాన్
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర పర్యాటక గైడులో నుంచి తాజ్‌మహల్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ యూపీ శాసనసభ్యుడు సంగీత్ సోమ్ కూడా తాజ్‌మహల్ చరిత్రపై విమర్శలు చేశారు. ఈ విషయాలపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ మాట్లాడుతూ... అప్పటి కాలంలో దేశాన్ని పాలించిన వారిని గుర్తు చేసే చారిత్రాత్మక కట్టడాలను ధ్వంసం చేయాలని వ్యాఖ్యానించారు. అందులో భాగంగా పార్లమెంట్‌తో పాటు కుతుబ్ మినార్, రాష్ట్రపతి భవన్, తాజ్‌మహల్ లాంటి కట్టడాలన్నింటినీ ధ్వంసం చేయాలని పేర్కొన్నారు.
ఢిల్లీలోని పార్లమెంట్, రాష్ట్రపతి భవనాలు కూడా బానిసత్వానికి ప్రతీకలుగా ఉన్నాయని అజాంఖాన్ చెప్పుకొచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.