జగపతిబాబు: కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను ముక్కలుగా నరికేస్తారని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అన్నారు!: సినీ నటుడు జగపతిబాబు

  • విజయవాడ సిద్ధార్థ కళాశాలకు గతంలో ముఖ్యఅతిథిగా వెళ్లా
  • కులానికి వ్యతిరేకంగా మాట్లాడతానంటే ప్రిన్సిపాల్ వద్దన్నారు
  • అయినా, నేను మాట్లాడా..విద్యార్థుల చప్పట్లతో మార్మోగిపోయింది
  • నాటి సంఘటనను గుర్తుచేసుకున్న జగపతిబాబు

కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే తనను ముక్కలు ముక్కలుగా నరికేస్తారని అన్నారని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు అన్నారు. ‘టీవీ 9’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సుమారు పదేళ్ల క్రితం విజయవాడ సిద్ధార్థ కళాశాలలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.

‘పదేళ్ల క్రితం, విజయవాడ సిద్ధార్థ కాలేజీకి నన్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తే వెళ్లాను. ‘కులానికి వ్యతిరేకంగా మాట్లాడతాను. ఏమైనా సమస్య ఉంటుందా?’ అని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ని అడిగా. ‘మిమ్మల్ని మర్డర్ చేసేస్తారండి! కాలేజ్ ఆడిటోరియంలో రెండు వేల మంది విద్యార్థులు ఉన్నారు.. మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరికేస్తారు. కులానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడొద్దు’ అని ఆ ప్రిన్సిపాల్ నాతో గట్టిగా చెప్పారు.

సరే, కాలేజ్ ఆడిటోరియంలోకి వెళ్లి, మైక్ తీసుకున్నా. ‘ఏంటయ్యా!, మీ ‘కమ్మ’ గోల, ‘కమ్మ’ అయితే ఏంటీ? గొప్పోళ్లా? ఆ కులంలో మనం పుట్టాం అంతే! ఆ కులం కూడా ఎవరో క్రియేట్ చేస్తే, అందులో పుట్టాం. మీరు కొట్టుకోవడం, మర్డర్లు చేసుకోవడం.. కులం పేరుతో ఒక సీఎంను ఎన్నుకోవడం ఏంటి? మీ ఆలోచనలు, ఆలోచించే విధానం తప్పు. ఈ విషయాల గురించి నేను మాట్లాడితే మీరు నన్ను చంపేస్తారని మీ ప్రిన్సిపాల్ నాతో అన్నారు. నరికేయండి.. నేను ఒక్కడినే ఉన్నాను. నా వెపన్ కూడా తీసుకురాలేదు, నాకెవరూ బాడీగార్డ్స్ లేరు. ‘నన్ను చంపేస్తే మీకు సంతోషం అనుకుంటే నేను రెడీ’ అని చెప్పా. ఆ తర్వాత చప్పట్టు మార్మోగిపోయాయి. ఓ సెలెబ్రిటీగా నేను చెప్పిన మాటలను వారు అంగీకరించారు. ఇంకొకళ్లయితే మర్డర్ చేసే వారేమో! అది, వేరే సంగతి. కనీసం నా ద్వారా ఓ మెస్సేజ్ వెళ్లింది’ అని జగపతిబాబు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News