అగ్నిప్రమాదం: హన్మకొండ రోహిణి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి.. పలువురికి అస్వస్థత!

  • వ‌రంగ‌ల్ అర్బన్‌ జిల్లా హన్మకొండలో అలజడి
  • ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో ఆక్సిజన్ సిలిండర్ పేలుడు
  • అనంత‌రం షార్ట్ సర్క్యూట్
  • మంటలను అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

వ‌రంగ‌ల్ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుప‌త్రి అంతటా మంట‌లు వ్యాపిస్తుండ‌డంతో రోగులు, వైద్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ద‌ట్టంగా పొగ రావ‌డంతో ఊపిరి అందక అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో పాటు అనంత‌రం షార్ట్ సర్క్యూట్ కూడా సంభ‌వించ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఆసుప‌త్రిలోని రెండో అంతస్తులో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో కుమార స్వామి, మ‌ల్ల‌మ్మ అనే రోగులు మృతి చెందారు. వెంటనే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది... ఆసుపత్రిలోని మిగ‌తా 198 మంది రోగుల‌ను బయటకు తీసుకొచ్చి, వారిని ఇతర ఆసుపత్రులకు తరలించారు. అక్క‌డ‌కు చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కొంద‌రు రోగుల‌ను ఆరు బయటే ఉంచి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.  

  • Loading...

More Telugu News