గళ్ల చొక్కా: కొత్త లుక్‌తో ఆక‌ట్టుకుంటోన్న ప్ర‌భాస్!

  • ‘బాహుబ‌లి’ త‌రువాత ‘సాహో’లో నటిస్తోన్న ప్రభాస్
  • ప్ర‌స్తుతం ఆ సినిమా ప‌నుల్లోనే బిజీబిజీగా బాహుబలి హీరో
  • ఎంతో సాఫ్ట్‌గా క‌నిపిస్తోన్న ప్రభాస్ కొత్త లుక్

‘బాహుబ‌లి’ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేస్తోన్న ‘సాహో’ చిత్రంపై అభిమానుల్లో ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగులోనే ప్ర‌భాస్ బిజీబిజీగా ఉన్నాడు. ఆ నేప‌థ్యంలో అప్పుడ‌ప్పుడు ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు ఫొటోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. స‌రికొత్త లుక్‌లో ప్ర‌భాస్ క‌నిపించిన ప్ర‌తీసారి ‘సాహో’ సినిమాలో ప్ర‌భాస్ లుక్ ఇదేనేమో? అని అభిమానులు అనుకుంటున్నారు. తాజాగా ప్ర‌భాస్‌కు సంబంధించిన మ‌రో కొత్త లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో ప్ర‌భాస్ ఎంతో సాఫ్ట్‌గా క‌నిపిస్తున్నాడు. జేబులో చేతులు పెట్టుకుని, గ‌ళ్ల తెలుపు రంగు చొక్కా వేసుకుని, చిరున‌వ్వు చిందిస్తూ ఆయ‌న క‌న‌ప‌డుతున్నాడు. మీరూ చూడండి..

  • Loading...

More Telugu News