సమంత: అభిమాని ప్రశంస .. సమంత కేరింత!
- మా ‘సామ్’ కి గ్లామర్ పెరుగుతోందంటూ ఓ అభిమాని ట్వీట్
- రిప్లై ఇచ్చిన సమంత
- ‘హ్యపీ హా హా’ అన్న సామ్
హీరో నాగచైతన్య భార్య, ప్రముఖ సినీ నటి సమంతను ఓ అభిమాని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ కు సామ్ సంతోషపడుతోంది. ‘ఎవరికైనా పెళ్లి అయితే గ్లామర్ పోతుంది. కానీ, మా సామ్ కి ఏంటి ఇంకా గ్లామర్ పెరుగుతోంది’ అని ఆ అభిమాని ట్వీట్ చేశాడు. ‘రాజుగారి గది 2’ సినిమా సక్సెస్ మీట్ కు సంబంధించిన సమంత ఫొటోలనూ పోస్ట్ చేశాడు. ఇందుకు స్పందించిన సమంత ‘హ్యాపీ హా హా’ అంటూ తన సంతోషం వ్యక్తం చేసింది.