వర్మ: అందుకే, పవన్ కల్యాణ్‌కి కొడుకు పుట్టినప్పుడు అలాంటి ట్వీట్ చేశాను: రామ్ గోపాల్ వర్మ
- పవన్ కల్యాణ్ గురించి ఈ మధ్యకాలంలో రెండే ట్వీట్లు చేశా
- నాకు పిల్లల కన్నా పవన్ కల్యాణ్ ఎక్కువ ఇష్టం.. అందుకే మొన్న అలా ట్వీట్ చేశా
- ట్వీట్ చేసి నా చావు నేను చస్తా
ఈ మధ్య కాలంలో తాను సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి రెండే ట్వీట్లు చేశానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్‌పై ట్వీట్లు చేయడం ప్రస్తుతం మానేశానని అన్నారు. గతంలో పవనిజం అనే బుక్‌పై పవన్ గురించి స్పందిస్తూ సానుకూలంగానే రివ్యూ రాశానని అన్నారు. కో రైటర్ గురించి మాత్రం విమర్శించానని అన్నారు.
ఇక మొన్న పవన్ కల్యాణ్‌కి కొడుకు పుట్టినందుకు ట్వీట్ చేశానని అన్నారు. ఎందుకంటే, తనకు పిల్లల కన్నా పవన్ కల్యాణ్ ఎక్కువ ఇష్టం అని అన్నారు. ట్వీట్ చేసి తన చావు తాను చస్తానని, మీ చావు మీరు చావండి అంటూ అభిమానులకు చెప్పబోనని అది వారి ఇష్టమని అన్నారు. కాగా, కొడుకుని ఒడిలో పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఎంతో క్యూట్ గా ఉన్నారని ఇటీవల వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.