జగపతిబాబు: నా టీనేజ్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా.. మా అమ్మకు చెబితే పెళ్లి చేసుకోవద్దంది: సినీ నటుడు జగపతిబాబు
- అమ్మ మాటను గౌరవించా
- ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని అమ్మ ఎందుకన్నదో ఆ తర్వాత నాకు అర్థమైంది
- ఆ రోజున అమ్మ మాట వినడం వల్లే నేను బాగున్నా
- ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు
తాను టీనేజ్ లో ఉండగా ఒక అమ్మాయిని లవ్ చేశానని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తన తల్లికి చెబితే వద్దని చెప్పారని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు నాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు. ‘టీవీ 9’కిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అమ్మ చెప్పిన మాట విని .. ఆ రోజున ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే, ఆ రోజున అమ్మ మాట వినడం వల్ల నేను బాగున్నాను.
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని అమ్మ ఎందుకన్నది అనే విషయం నాకు ఆ తర్వాత అర్థమైంది. పెద్దవాళ్లు చెప్పే మాటలు కూడా వినాలి. పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్నంత ప్రేమ మరెవ్వరికీ ఉండదు. పిల్లలకు తల్లిదండ్రులు సజెస్ట్ చేయడం, గైడ్ చేయడం, వాస్తవికత గురించి చెప్పడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ, తక్కువ కులం, ఎక్కువ కులం గురించి తల్లిదండ్రులు మాట్లాడితేనే సమస్య వస్తుంది. అది వాళ్ల ఇగో ప్రాబ్లమ్ వల్ల వచ్చే సమస్య. ఆ సమస్య నుంచి ఎవరికి వాళ్లే బయటపడాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే’ అని చెప్పుకొచ్చారు.