అమర్ నాథ్ రెడ్డి: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి పర్యటన!
- కియా మోటర్స్, హుండాయ్ మోబిస్ కంపెనీ ప్రతినిధులతో చర్చ
- ఎస్ఎల్ గ్రూప్, సుంగ్ వూ కంపెనీ ప్రతినిధులతోనూ చర్చించనున్న మంత్రి
- మంత్రితో పాటు ఏపీఐఐసీ ఎండీ ఎ.బాబు, అనంతపురం కలెక్టర్ వీరపాండ్యన్
- ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వినతి
ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఆ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ప్రస్తుతం కియా మోటర్స్, హుండాయ్ మోబిస్ కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. ఎస్ఎల్ గ్రూప్, సుంగ్ వూ కంపెనీ ప్రతినిధులతోనూ అమర్‌నాథ్ రెడ్డి సమావేశమవుతారు.
అమర్‌నాథ్ రెడ్డితో పాటు ఏపీఐఐసీ ఎండీ ఎ.బాబు, అనంతపురం కలెక్టర్ వీరపాండ్యన్ కూడా ఉన్నారు. అనంతపురం జిల్లాలో కియా మోటర్స్ ఏర్పాటుపై చర్చ కొనసాగుతోంది. ఏపీలో దక్షిణ కొరియా కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయితీల గురించి వారు వివరిస్తున్నారు.