గోపాల: మన్నన పొందిన మామాకోడళ్లకు శుభాభినందనలు: పరుచూరి గోపాలకృష్ణ
- ట్విట్టర్‌లో ప్రతిరోజూ తనదైన శైలిలో అభిప్రాయాలను పంచుకుంటోన్న గోపాలకృష్ణ
- మామాకోడళ్లు అక్కినేని నాగార్జున, సమంతను అభినందించిన పరుచూరి
- ఇటీవలే విడుదలైన ‘రాజుగారి గది-2’
యూ ట్యూబ్‌లో ప్రతి మంగళవారం ‘పరుచూరి పలుకులు’ పేరుతో, ప్రతి శుక్రవారం ‘పరుచూరి పాఠాలు’ పేరుతో సినీ రంగంలో తన అనుభవాలను పంచుకుంటున్నారు సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ట్విట్టర్‌లో ప్రతిరోజూ తనదైన శైలిలో సానుకూల దృక్ఫథాన్ని పెంచుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. అలాగే కొత్త సినిమాలపై తన అనుభవాలను చెబుతున్నారు.
ఈ క్రమంలో మామాకోడళ్లు అక్కినేని నాగార్జున, సమంత నటించిన ‘రాజుగారి గది-2’ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ... ‘మన్నన పొందిన మామాకోడళ్లకు శుభాభినందనలు!’ అని పేర్కొన్నారు. అటు సినిమాలోనూ, ఇటు నిజజీవితంలోనూ హుషారుగా కనపడుతూ ఈ మామాకోడళ్లు ప్రేక్షకులను అలరిస్తోన్న విషయం తెలిసిందే.