రకుల్ ప్రీత్: రాత్రి పూట ఎందుకు నిద్రపట్టట్లేదని నా హృదయాన్ని అడిగాను: రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్య
- టాలీవుడ్‌లో దూసుకుపోతోన్న రకుల్ ప్రీత్ సింగ్
- సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ
- ఆకట్టుకుంటోన్న తాజా కామెంట్
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మంచి హిట్ సాధించి టాలీవుడ్‌లో దూసుకుపోతోన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులకు అందులోనే సరదాగా కబుర్లు చెబుతుంటుంది. ఆమెలో హాస్యం పాలు కూడా ఎక్కువే. వినూత్న పోస్టులు చేస్తూ మన ముఖాల్లో చిరునవ్వులు తెప్పిస్తోంది.
కాగా, ఈ రోజు ఈ అమ్మడు తన ఇన్ స్టాగ్రాంలో ఓ పోస్ట్ చేస్తూ ‘రాత్రి పూట ఎందుకు నిద్రపట్టట్లేదని నేను నా హృదయాన్ని అడిగాను’ అని ఆమె పేర్కొంది. దానికి తన హార్ట్ సమాధానం ఇస్తూ.. ‘ఎందుకంటే నీవు మధ్యాహ్నం పూట పడుకుంటున్నావు.. నీవు ప్రేమలో ఉన్నట్లు నటించకు’ అని చెప్పిందని ఈ అమ్మడు పేర్కొంది. టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌లలో ఒకరిగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం షూటింగుల్లో బిజీబిజీగా ఉంటోంది.