సమంత: నాకు ఎంతో ఇష్టమైన ఫొటో ఇది!: సమంత
- నాగచైతన్య, ఆయన తల్లి లక్ష్మి ఫొటో
- నేను చాలా అభిమానించే వ్యక్తి ఆమె
- పోస్ట్ చేసిన సమంత
నాగచైతన్య-సమంతల వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో పలు ఫొటోలు కనబడుతున్నాయి. అయితే, ‘నాకు ఎంతో ఇష్టమైన ఫొటో ఇది, తల్లీకొడుకు’, ‘నేను చాలా అభిమానించే వ్యక్తి ఆమె’ అంటూ ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సమంత పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో నాగచైతన్య, ఆయన తల్లి లక్ష్మి కలిసి నడుచుకుంటూ వస్తుంటారు.