సమంత: మరో వంద జన్మలెత్తినా నా భర్తగా నిన్నే కోరుకుంటా: సమంత

  • క్రైస్తవ పద్ధతిలో జరిగిన వివాహంలో సమంత చెప్పిన మాటలు
  • చై రాకతోనే నా జీవితానికి పరిపూర్ణత లభించింది
  • మన పిల్లలకు మంచి తండ్రివి అవుతావు

హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం నాగచైతన్య-సమంత వివాహం గోవాలో ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుకలు మొదలైనప్పటి నుంచి ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరడం విదితమే. తాజాగా, క్రైస్తవ పద్ధతిలో వీరి వివాహం జరిగిన సందర్భంలో నాగచైతన్య గురించి సమంత చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

 ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ, ‘నీ రాకతోనే నా జీవితానికి పరిపూర్ణత లభించింది. నా జీవితంలో నేను చూసిన అద్భుతమైన చిరునవ్వు నీదే. నాకు మరో వంద అవకాశాలు వచ్చినా, మరో వంద జన్మలెత్తినా నా భర్తగా నిన్నే కోరుకుంటా. మన పిల్లలకు మంచి తండ్రివి అవుతావు’ అని ఆ రోజున సమంత భావోద్వేగంతో మాట్లాడింది.

  • Loading...

More Telugu News