పాకిస్థాన్: ఆసియా కప్ హాకీ టోర్నీ: పాకిస్థాన్ పై భారత్ విజయం
- ‘పాక్’పై భారత్ ఘన విజయం
- పూల్-ఏ లో అగ్రస్థానంలో భారత్
- హాకీ అభిమానుల హర్షం
ఆసియా కప్ హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ పై 3-1 తేడాతో భారత్ ఈ గెలుపు సాధించింది. దీంతో, పాక్ పై భారత్ హ్యాట్రిక్ విజయం సాధించినట్టయింది. పూల్-ఏ లో అగ్రస్థానంలో భారత్ కొనసాగుతోంది. ఈ రోజు ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంపై హాకీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విజయంతో భారత్ 9 పాయింట్లతో పూల్-ఏ లో అగ్రస్థానంలో నిలిచింది. చింగల్‌సేన (13వ నిమిషం), రమణ్‌దీప్ సింగ్ (44వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (45వ నిమిషం) తలో గోల్ కొట్టారు. పాక్‌లో అలీషాన్ (49వ నిమిషం) ఒక్కడే గోల్ చేయగలిగాడు. కాగా, ఈ సందర్భంగా ‘హాకీ ఇండియా’ ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. భారత్ గెలిచిందని, పాకిస్థాన్ పై హ్యాట్రిక్ విజయం సాధించిందని పేర్కొంది.