వైసీపీ: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు
- మంగళగిరి కోర్టు సమన్లు జారీ
- నాడు వైసీపీ నిర్వహించిన బంద్ విషయంలో ‘ఆళ్ల’పై కేసు
- నవంబరు 13న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు వెళ్లాయి. 2015 ఆగస్టు 29న మంగళగిరిలో వైసీపీ నిర్వహించిన బంద్ కు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి, పదిహేను మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి వీరిపై నాడు కేసు నమోదైంది.
అయితే, ఈ కేసు విచారణకు సంబంధించి నవంబరు 13న మంగళగిరి కోర్టుకు హాజరు కావాల్సిందిగా నిన్న న్యాయమూర్తి ఆళ్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరిలో నాడు ఈ బంద్ నిర్వహించారు.