సల్మాన్: ఓ కంటెస్టెంట్ ను శునకాలతో పోల్చిన సల్మాన్.. ఆపై క్షమాపణలు!
- ఓ కంటెస్టెంట్ పై మండిపడ్డ సల్మాన్
- శునకాలతో పోల్చితే వాటి విలువ తగ్గుతుందన్న సల్లూ భాయ్
- శునకాలకు క్షమాపణలు చెప్పిన వైనం
సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ 11వ సీజన్ కు బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో నేపథ్యంలో ఓ కంటెస్టెంట్ ను తిట్టిన సల్మాన్, అతన్ని శునకాలతో పోల్చాడు. ఆ తర్వాత క్షమాపణలూ చెప్పాడు. అయితే, క్షమాపణలు చెప్పింది సదరు కంటెస్టెంట్ కు కాదు, శునకాలకు!
ఎందుకంటే, శునకాలతో అతన్ని పోల్చి వాటి విలువను తగ్గించినందుకు క్షమాపణలు చెప్పానంటూ సల్మాన్ చమత్కరించాడు. కాగా, గతంలో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ జుబైర్ ఖాన్ ను సల్మాన్ పంపివేశాడు. ఈ విషయమై కోర్టుకు ఎక్కుతానని, సల్మాన్ పై కేసు పెడతానని జుబైర్ ఖాన్ హల్ చల్ చేశాడు.