నివేదా థామస్: ‘గూగుల్’ని నమ్మి బర్త్ డే విషెస్ చెప్పిన నెటిజన్లు.. ఇవాళ తన పుట్టినరోజు కాదన్న నివేదా థామస్!

  • నివేదా థామస్ కు బర్త్ డే శుభాకాంక్షల వెల్లువ
  • ఈరోజు కాదంటూ ట్వీట్  
  • నా కోసం సమయం కేటాయించిన వారందరికీ ధన్యవాదాలు

ఈరోజు ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ బర్త్ డేగా ‘గూగుల్’లో ఉండటంతో నెటిజన్లు, ఆమె అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పలు ట్వీట్లు చేశారు. అయితే, నివేదా థామస్ చేసిన పోస్ట్ వారిని నిరాశ పరిచింది. ఈ రోజు తన పుట్టినరోజు కాదని, అయినప్పటికీ, తనకు విషెస్ చెప్పేందుకు చాలా మంది తమ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలని పేర్కొంది.

ఇదిలా ఉండగా, ‘గూగుల్‌’లో నివేదా పుట్టినరోజు తేదీ మాత్రం అక్టోబర్‌ 15 అని చూపిస్తోంది. కానీ నివేదా మాత్రం నేడు తన పుట్టినరోజు కాదని చెబుతోంది. ఇంతకీ, నివేదా థామస్ పుట్టిన రోజు ఎప్పుడో అనే ప్రశ్న ఆమె అభిమానులు, నెటిజన్లను వేధిస్తోంది. కాగా, ఇప్పటి వరకు నివేదా తెలుగులో నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి.  

  • Loading...

More Telugu News