ఫేస్ బుక్: ఎమర్జెన్సీ నెంబరుకి ఫోన్ చేస్తోన్న ఫేస్‌బుక్ యూజ‌ర్లు.. తలలు పట్టుకుంటోన్న పోలీసులు

  • సైట్ ప‌నిచేయ‌కుండా ఆగిపోతే ఆందోళ‌న చెందుతోన్న అమెరికా యూజర్లు
  • ఎమర్జెన్సీ నెంబర్ 911 కి ఫోన్ చేసి ఫేస్‌బుక్ గురించి ఫిర్యాదు
  • అలా చేయొద్దంటోన్న పోలీసులు

సోష‌ల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కి బాగా అలవాటు పడిపోయిన వారు ఈ కాలంలో చాలామంది వున్నారు. అందుకే, కాసేపు ఆ సైట్ ప‌నిచేయ‌కుండా ఆగిపోయిందంటే ఎంతో ఆందోళ‌న చెందేవారు కూడా ఉన్నారు. అమెరికాలో అయితే ఫేస్‌బుక్ సర్వర్లు డౌన్ అయితే ఫిర్యాదులు కూడా చేస్తుంటారు. అయితే, ఫేస్‌బుక్ సంస్థ‌కు కాకుండా ఎమర్జెన్సీ నెంబర్ 911 కి ఫోన్ చేసి, ఫేస్‌బుక్ గురించి ఫిర్యాదు చేస్తున్నారట‌.

ఫేస్‌బుక్ యూజ‌ర్లు ప‌దే ప‌దే త‌మ‌కి ఫోన్ చేసి ఈ విష‌యంపై ఫిర్యాదులు చేస్తుండ‌డంతో పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చేయాల్సిన ఫోన్ నెంబర్ కి ఇటువంటి ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు. వాషింగ్టన్‌లోని బొథెల్ పోలీసులు ఈ విష‌యంపై ట్వీట్ చేస్తూ... 911కి ఫోన్ చేయ‌కూడ‌ద‌ని చెప్పారు. ఆ పోలీసుల తిప్ప‌ల‌పై నెటిజ‌న్లు సెటైర్లు వేసుకుంటూ న‌వ్వుకుంటున్నారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

  • Loading...

More Telugu News