చినజీయర్ స్వామి: దేవుళ్ల సొత్తు తినే ట్రెండ్ కు కేసీఆర్ చరమగీతం పాడారు: చినజీయర్ స్వామి
- భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న చినజీయర్ స్వామి
- దేవుడి సేవలో సీఎం కేసీఆర్ ముందున్నారు
- రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే దేవుడి సేవ చేయాలి
దేవుళ్ల సొత్తు తినే ట్రెండ్ కు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారని చినజీయర్ స్వామీజీ కొనియాడారు. భద్రాచలంలోని రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దేవుడి సేవ చేస్తూ కేసీఆర్ ముందున్నారని అన్నారు. యాదాద్రి తరహాలో భద్రాచలం అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ ను, మంత్రి తుమ్మలను చినజీయర్ స్వామి ఆశీర్వదించారు. వానలు, కురిసి పంటలు పండి, రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే దేవుడి సేవ చేయాలని ఈ సందర్భంగా స్వామీజీ సూచించారు.