పవన్ కల్యాణ్: హేట్సాఫ్ టూ పవన్ కల్యాణ్: పరుచూరి గోపాలకృష్ణ

  • ‘పరుచూరి పాఠాలు’లో గోపాలకృష్ణ
  • చెట్టుకు విత్తనం లాగా, కథకు ఒక ఆలోచన
  • ‘కథాంశం’ గురించి వివరించి చెప్పిన ప్రముఖ మాటల రచయిత

చెట్టుకు విత్తనం లాగా, కథకు ఒక ఆలోచన వస్తే, అది ‘కథాంశం’గా ఎలా డెవలప్ చేస్తారనే విషయాన్ని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ వివరించి చెప్పారు. ఈ సందర్భంగా ‘పరుచూరి పాఠాలు’ అనే వీడియోను పరుచూరి గోపాలకృష్ణ తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘ఫిదా’, మూడేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదలైన ‘అత్తారింటికి దారేది’ చిత్రాల గురించి ప్రస్తావించారు. ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్ లో పవన్ కల్యాణ్ నటించిన తీరు అద్భుతం. హేట్సాఫ్ టూ పవన్ కల్యాణ్. ఎందుకంటే, అంత మాస్ ఇమేజ్ ఉన్న ఓ హీరో కన్నీరు పెట్టుకుంటూ అత్తను బతిమాలక్కర్లా!’ అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News