లక్ష్మీపార్వతి: నాడు నేను చెప్పిన కథ విని ఎన్టీఆర్ ఎంతో ప్రభావితమయ్యారు: లక్ష్మీపార్వతి

  • నా ‘వైదేహి’ నవలను సినిమాగా తీయాలని ఎన్టీఆర్ అనుకున్నారు
  • సీత పాత్రలో శ్రీదేవిని తీసుకోవాలని చెప్పారు
  • నాటి విషయాలను గుర్తుచేసుకున్న లక్ష్మీపార్వతి

నాడు తాను చెప్పిన కథ విని ఎన్టీఆర్ ఎంతో ప్రభావితమయ్యారని లక్ష్మీపార్వతి అన్నారు. ‘తెలుగు పాపులర్ టీవీ డాట్ కామ్’ వెబ్ ఛానెల్ లో వచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నేను వైదేహి అనే నవల రాశాను. ఈ కథ గురించి ఓసారి ఎన్టీఆర్ గారికి చెప్పాను. ఈ కథ విన్న తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అసలు, ఇట్లాంటి కథ వినలేదని సంతోషపడిపోయారు. సీతాదేవి పాత్రలో శ్రీదేవిని తీసుకోవాలని అనుకున్నారు. ఈ సినిమాకు నేను సంభాషణలు రాసిస్తాను అని చెప్పాను. ఈ చిత్రానికి సంభాషణలు నేను తప్పా, ఎవరూ రాయలేరు. ఎందుకంటే, ఆ కథ నా మదిలో అలా ఉండిపోయింది’ అంటూ నాటి విషయాలను లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News