లక్ష్మి పార్వతి: ‘నా భార్య, సహచరి..అన్నీ నువ్వే’ అని ఎన్టీఆర్ అనేవారు!: లక్ష్మీపార్వతి

  • నాటి విషయాలను ప్రస్తావించిన లక్ష్మీపార్వతి
  • ఇద్దరు అల్లుళ్ల వల్ల నాడు టీడీపీ ఓడిపోయిందని ఎన్టీఆర్ నమ్మారు
  • నాడు ఎన్టీఆర్ చెప్పిన విధంగానే నేను నడచుకున్నా

ఇద్దరు అల్లుళ్ల వల్ల నాడు టీడీపీ ఓడిపోయిందని ఎన్టీఆర్ నమ్మడం వల్లే తనను పార్టీ కోసం ఉపయోగించుకున్నారని టీడీపీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు దివంగత నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి అన్నారు. ‘తెలుగు పాప్యులర్ డాట్ కామ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి విషయాలను ఆమె ప్రస్తావించారు.

‘అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు అల్లుళ్ల వల్ల టీడీపీ ఓడిపోయిందని ఎన్టీఆర్ నమ్మూతూ వచ్చారు. అందుకనే, నన్ను పార్టీ కోసం ఉపయోగించుకున్నారు. ఎలా అంటే, ఓ  విశ్వాసపాత్రురాలిగా! ‘లక్ష్మీ! నేను ఎవ్వరి అభిప్రాయం తీసుకోదలచుకోలేదు. దిస్ ఈజ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక, పార్టీ అధ్యక్షుడిగా దీనిపై పూర్తిగా నా కంట్రోల్ పెట్టదలచుకున్నా’ అని నాడు ఎన్టీఆర్ స్పష్టంగా నాతో చెప్పారు.

‘నువ్వు నాకు హెల్ప్ చెయ్యి.. నా భార్య, సహచరి.. అన్నీ నువ్వే. అభ్యర్థులకు సంబంధించిన నివేదికలన్నీ ఎలా తెప్పిస్తావో తెప్పించు. నాకు ఫీడ్ చెయ్యి’ అని అనేవారు. ఆయన చెప్పిన విధంగానే నేను చేశాను. నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నన్ను వెళ్లమని ఎన్టీఆర్ చెప్పడంతో నేను వెళ్లాను. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచాము. ఆమె వెళ్లకపోతే కాంగ్రెస్ వాళ్లు గెలిచిన స్థానాల్లో కూడా టీడీపీ గెలిచి ఉండేదని నాడు ఈనాడు పేపర్ లో రాశారు. నాకు వ్యతిరేకంగా కుట్ర అప్పటి నుంచే ఎలా మొదలైందో చూశారా’!’ అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News