ట్రాఫిక్ నిబంధనలు: మ‌రో ఘ‌ట‌న‌.. ఒకే బైకుపై ఐదుగురి ప్ర‌యాణం.. ఆపి దండం పెట్టిన డీఎస్పీ ఫొటో వైర‌ల్‌!

  • ట్రాఫిక్ నియ‌మాలు పాటించాల‌ని కొత్త రీతిలో చెబుతోన్న పోలీసులు
  • ఇటీవలే అనంతపురంలో.. ఇప్పుడు వేములవాడలో
  • వాహనదారుడికి దండం పెట్టిన వేములవాడ డీఎస్పీ అవధాని చంద్రశేఖర్

ట్రాఫిక్ నియ‌మాలు పాటించాల‌ని చెప్పీ చెప్పీ విసిగిపోయిన తెలుగు పోలీసులు చెప్ప‌డం మానేసి దండం పెట్టేస్తున్నారు. ట్రాఫిక్ నియ‌మాల‌ను ఉల్లంఘించే వాహ‌న‌దారుల‌కు అలా చేయ‌కూడ‌ద‌ని వినూత్న రీతిలో చెబుతున్నారు. ఇటీవ‌లే అనంత‌పురంలో జరిగిన ఓ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆ జిల్లాలోని మ‌డ‌క‌సిర‌లో ఒక బైకుపై ఓ వ్య‌క్తి హెల్మెట్ లేకుండా ప్ర‌యాణించ‌డ‌మే కాకుండా త‌న బైకుపై మ‌రో ఐదుగురిని కూర్చోబెట్టుకుని వెళ్లాడు. ఆయన‌ను ఆపిన పోలీసు దండం పెట్ట‌డంతో ఆ ఫొటో జాతీయ మీడియాలోనూ వ‌చ్చేసింది. ఇప్పుడు అదే రీతిలో తెలంగాణ పోలీసు అధికారి కూడా దండం పెట్టారు.

రోడ్డుపై ఒకే బైకుపై ఐదుగురు వెళ్తోన్న సీనుని చూసిన  వేములవాడ డీఎస్పీ అవధాని చంద్రశేఖర్ ఆ బైకుని ఆపి వారికి దండం పెట్టేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఫ్రెండ్లీ పోలీస్ వినూత్న రీతిలో కౌన్సెలింగ్ ఇస్తున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మీరూ చూడండి...

  • Loading...

More Telugu News