విజయ్ దేవర కొండ: 'అర్జున్ రెడ్డి' హాఫ్ సెంచరీ... బ్యాట్ పైకెత్తుతున్నానన్న విజయ్ దేవరకొండ!

  • 50 రోజులు.. హౌస్ ఫుల్‌గా ఉన్న స్టేడియాల్లో బ్యాటుని ఎత్తుతున్నా
  • తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో గేమ్ చేంజర్ ‘అర్జున్ రెడ్డి’
  • ట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ

క్రికెట్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచ‌రీ బాదితే గ‌ర్వంతో బ్యాటు లేపి స్టేడియంలో ఉన్న ప్రేక్ష‌కుల‌కు అభివాదం చేస్తాడు. ఇప్పటికే ఎన్నో అర్ధ సెంచ‌రీలు బాదిన బ్యాట్స్‌మెన్‌ అంత‌గా ఉప్పొంగి పోరు కానీ, కొత్త వారు మాత్రం ఎంతో సంబ‌ర‌ప‌డిపోతారు. కాగా, యువ‌ న‌టుడు విజ‌య్ దేవ‌రకొండ హీరోగా న‌టించిన‌ ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఈ రోజుకి 50 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఈ యాభై రోజుల‌ని క్రికెట్ ఆట‌గాళ్ల‌ అర్ధ సెంచ‌రీతో పోల్చుతూ విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశాడు. ‘50 రోజులు.. హౌస్ ఫుల్‌గా ఉన్న స్టేడియాల్లో (సినిమా థియేట‌ర్ల‌లో) బ్యాటుని ఎత్తుతున్నా’నని ఆయ‌న పేర్కొన్నాడు.

తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో గేమ్ చేంజర్ ‘అర్జున్ రెడ్డి’ చిత్రం అంటూ త‌న సినిమా ఫొటోను విజయ్ దేవరకొండ పెట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉండడంతో ఈ సినిమా విడుదలైన మొదట్లో మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అయినప్పటికీ తాము ఎవరిమాటా వినమంటూ ‘అర్జున్ రెడ్డి’ హీరో, దర్శకుడు సమర్థించుకున్నారు. ఆ వివాదం వల్ల ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News