సుప్రీంకోర్టు: ఇది మానవ హక్కుల విషయం.. రోహింగ్యా ముస్లింలను వెనక్కి పంపొద్దు: సుప్రీంకోర్టు ఆదేశం

- దేశభద్రత దృష్ట్యా రోహింగ్యాలను భారత్ లో ఉండనివ్వొద్దంటోన్న కేంద్ర సర్కారు
- మానవ హక్కులనూ దృష్టిలో పెట్టుకోవాలన్న సుప్రీంకోర్టు
- తదుపరి విచారణ జరిగే వరకు ఆగాలి
- తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా
రోహింగ్యా ముస్లింలను మయన్మార్ ఆర్మీ తన్ని తరిమేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది భారత్‌లోకి వచ్చారు. వారి ప్రవేశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదు. వారు శరణార్థులు కాదని, వారు దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులని ఇటీవలే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా అన్నారు.
దీనిపై ఈ రోజు విచారించిన సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత మాత్రమే కాకుండా, మానవ హక్కులనూ దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. రోహింగ్యాల అంశం మానవహక్కులతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. తమ తదుపరి విచారణ జరిగే వరకు రోహింగ్యాలను వెనక్కి పంపొద్దని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.